కేసీఆర్: డిసెంబర్ 9 తర్వాత కేసీఆర్ ఆలోచనలన్నీ నా చుట్టూనే తిరుగుతాయి!: రేవంత్ రెడ్డి

  • రాజకీయంగా నా ఎత్తుగడ నాకు ఉంది 
  • టీడీపీలో ఉంటూ కేసీఆర్ కు ఉపాధి కూలీ పని చేస్తున్న వారికి చెప్పాల్సిందేమీ లేదు 
  • డిసెంబర్ 9న ‘మీట్ ది ప్రెస్’ లో పాల్గొంటా
రాజకీయంగా తన ఎత్తుగడ తనకు ఉందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిసెంబర్ 9న ‘మీట్ ది ప్రెస్’ లో తాను పాల్గొన్న అనంతరం, కేసీఆర్ ఆలోచనలు అన్నీ తన చుట్టే తిరుగుతాయని జోస్యం చెప్పారు. టీడీపీలో ఉంటూ కేసీఆర్ కు ఉపాధి కూలీ పని చేస్తున్న వారికి తాను చెప్పాల్సిందేమీ లేదని అన్నారు. ‘నా యుద్ధం కేసీఆర్ కూలీలపై కాదు .. కేసీఆర్ పైనే’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్
రేవంత్ రెడ్డి

More Telugu News