rajasekhar: 'గరుడ వేగ' హిట్ ఆ సీన్ పైనే ఆధారపడి ఉందనుకున్నాను!: రాజశేఖర్

  • సినిమా చూశాక ఫస్టాఫ్ సూపర్ అనిపించింది 
  • సెకండాఫ్ లో కంటైనర్ సీన్ విషయంలోనే డౌట్ వచ్చింది 
  • ఆ సీన్ గురించే అందరినీ అడిగేవాడిని
  • ఆ సీన్ పాస్ అయింది .. సినిమా హిట్ అయింది  

"సాధారణంగా సినిమా హిట్ అయిన తరువాత ఈ సక్సెస్ మేం ఊహించిందేనని చాలామంది చెబుతుంటారు. ఈ సినిమా హిట్ విషయంలో మీకు ఎప్పుడైనా .. ఎక్కడైనా డౌట్ వచ్చిందా? ఇంత ఇన్వెస్ట్ చేశామేననే భయం కలిగిందా?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్  ఇంటర్వ్యూలో రాజశేఖర్ కి ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ " ఈ సినిమా చూసినప్పుడు ఫస్టాఫ్ సూపర్ అనిపించింది. సెకండాఫ్ లో కంటైనర్ సీన్ వుంది కదా .. ఆ సీన్ పండితే సినిమా హిట్ .. ఆ సీన్ పండకపోతే ఏమవుతుందోననే ఒక భయం ఉండేది. ఆ సీన్ సెంటిమెంట్ తో లింకై ఉంటుంది .. అందువలన డోస్ ఎక్కువైందా? తక్కువైందా? .. సరిపోయిందా? అనే విషయంలోనే డౌట్ గా ఉండేది. అందువల్లనే ఆ కంటైనర్ సీన్ బాగుందా .. బాగుందా? అని అందరినీ అడుగుతూ ఉండేవాడిని .. అందరూ బాగుందనేవారు. లేడీస్ కి కూడా ఆ సీన్ బాగా నచ్చింది. మొత్తానికి కంటైనర్ సీన్ పాస్ అయింది .. సినిమా హిట్ అయింది" అంటూ నవ్వేశారు రాజశేఖర్.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News