రేవంత్ రెడ్డి: కేసీఆర్ దగ్గర డబ్బులు తెచ్చుకుని రమణ నాపై విమర్శలు చేస్తున్నారు!: రేవంత్ రెడ్డి

  • టీటీడీపీ నేత రమణపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రేవంత్
  •  రమణ తన ముసుగు తీసేసి టీఆర్ఎస్ లో చేరితే బాగుంటుంది
  •  నాకు రమణ సర్టిఫికెట్ అవసరం లేదు
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ దగ్గర డబ్బులు తెచ్చుకుని ఆయన తనపై విమర్శలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరితే రమణ ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు.

కొడంగల్ లో సమావేశం నిర్వహించాలనడం కాదు, గజ్వేల్, సిద్దిపేట్ లో సమావేశం నిర్వహిస్తానని ఎందుకు చెప్పడం లేదని రమణని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో చేరాలనుకుంటే తన ముసుగు తీసేసి రమణ నేరుగా ఆ పార్టీలో చేరితే బాగుంటుంది కదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీలో ఉన్న నేతలందరినీ టీఆర్ఎస్ లో చేర్చిన తర్వాత రమణ కూడా ఆ పార్టీలో చేరతారని ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. తనకు రమణ సర్టిఫికెట్ అవసరం లేదని, చేతనైతే సొంత నియోజకవర్గంలో సమావేశం నిర్వహించుకోవాలని రమణకు సూచించారు.
రేవంత్ రెడ్డి
కాంగ్రెస్

More Telugu News