ys jagan: నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తా!: బోయలకు జగన్ హామీ

  • తమను ఎస్టీలలో చేర్చాలన్న బోయలు 
  • అసెంబ్లీలో తీర్మానం చేసి, ఢిల్లీకి పంపిస్తా
  • కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తానన్న జగన్
పాదయాత్రలో జగన్ చేస్తున్న హామీల సంఖ్య పెరుగుతూ పోతోంది. తాజాగా బోయలను ఎస్టీలో చేర్చడంపై ఆయన స్పందించారు. 2019లో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే... బోయలను ఎస్టీలలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు. కడప జిల్లా పోట్లదుర్గి గ్రామంలో జగన్ ను బోయ కులస్థులు కలిశారు. తమను ఎస్టీల్లో చేర్చాలని ఈ సందర్బంగా వారు ఆయనను కోరారు. వీరి విన్నపంపై స్పందిస్తూ జగన్ పైవిధంగా హామీ ఇచ్చారు.

మరోవైపు, మార్గమధ్యంలో జగన్ ను కాంట్రాక్ట్ లెక్చరర్లు కలిశారు. తమను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం... ఇంతవరకు ఈ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదని... తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే మీ సమస్యను పరిష్కరిస్తానని వారికి జగన్ చెప్పారు.
ys jagan
YSRCP
jagan padayatra

More Telugu News