జగన్: జగన్ భద్రతా సిబ్బంది, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట!

  • కడప జిల్లా పోట్లదుర్తి గ్రామం వద్ద సంఘటన
  • జగన్ వద్దకు వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకున్న భద్రతా సిబ్బంది
  • వాగ్వాదం.. తోపులాట
ప్రజా సంకల్పయాత్ర ఐదో రోజు పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ భద్రతా సిబ్బందికి, ఆ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్దకు ఈరోజు జగన్ పాదయాత్ర చేరుకున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. జగన్ దగ్గరకు వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించగా ఆయన భద్రతా సిబ్బంది వారిని పక్కకు తోసేశారు.

దీంతో, ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తమను జగన్ దగ్గరకు అనుమతించలేదంటూ వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాగా, పోట్లదుర్తి గ్రామంలో జగన్ కు ఘన స్వాగతం లభించింది. అనంతరం, పార్టీ జెండాను ఆవిష్కరించారు. 
జగన్
వైసీపీ

More Telugu News