harassment: పైలట్ వేధింపులు తాళలేక ఉద్యోగిని రాజీనామా

  • తిరువనంతపురంలో మహిళా సిబ్బందిపై పైలట్ లైంగిక వేధింపులు
  • పోలీసులను ఆశ్రయించిన యువతి
  • పైలట్ వేధింపులు తాళలేక ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఫిర్యాదులో తెలిపిన యువతి
  • సెక్షన్ 354 (ఎ) ప్రకారం కేసు నమోదు 
కేరళ రాజధాని తిరువనంతపురంలో తాను పనిచేస్తున్న ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన పైలట్ పెడుతున్న లైంగిక వేధింపులు తాళలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని వేధింపుల వల్ల తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ ఆమె పోలీసులకు చేసిన లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సదరు పైలట్ పై ఐపీసీ 354 (ఏ) చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.  
harassment
pailot harassment
Police
kerala
tiruvanantapuram

More Telugu News