firing in hyderabad: హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం

  • మైలార్ దేవ్ పల్లిలో కాల్పులు
  • బాధితుడి శరీరంలోకి దూసుకెళ్లిన రెండు బుల్లెట్లు
  • తుపాకీకి లైసెన్స్ ఉందని గుర్తించిన పోలీసులు
హైదరాబాద్ శివార్లలోని మైలార్ దేవ్ పల్లిలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. కింగ్స్ కాలనీలో నివాసం ఉంటున్న ముస్తఫా అనే యువకుడిపై జుబేద్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. జుబేద్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖకు ముస్తఫా ఫిర్యాదు చేసి, తనిఖీలు చేయించాడన్న అనుమానంతోనే కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ముస్తఫా శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.

జుబేద్ వాడిన తుపాకీకి లైసెన్స్ ఉందని పోలీసులు గుర్తించారు. అయితే, ఇతనికి నేర చరిత్ర కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
firing in hyderabad
firing

More Telugu News