రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు: టీటీడీపీ నేత ఎల్. రమణ

  • రేవంత్ రెడ్డి కార్యకర్త స్థాయికి పడిపోయారు
  • టీటీడీపీలో నాయకులే పార్టీ మారారు..క్యాడర్ చెక్కు చెదరలేదు
  • కొడంగల్ లో త్వరలో సభ నిర్వహిస్తాం
  • పాత్రికేయులతో టీటీడీపీ అధ్యక్షుడు రమణ
ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదని, రాజీనామా లేఖను చంద్రబాబుకు ఇవ్వలేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. హైదరాబాద్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కార్యకర్త స్థాయికి పడిపోయారని అన్నారు. టీటీడీపీలో నాయకులే పార్టీ మారారు కానీ, క్యాడర్ చెక్కుచెదరలేదని చెప్పిన రమణ, కొడంగల్ లో త్వరలోనే ఓ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు.
రేవంత్ రెడ్డి
టీటీడీపీ నేత ఎల్. రమణ

More Telugu News