బెల్జియం రాజుకు క్రికెట్ పాఠాలు చెప్పిన సెహ్వాగ్!
- భారత పర్యటనలో ఉన్న బెల్జియం రాజు ఫిలిప్పి
- ముంబైలోని కార్యక్రమంలో పాల్గొన్న ఫిలిప్పి, సెహ్వాగ్
- విద్యార్థులతో కలసి కాసేపు క్రికెట్ ఆడిన రాజు
పర్యటనలో భాగంగా ఈ రోజు వారు ముంబైలోని ఓవల్ గ్రౌండ్ ను సందర్శించారు. యూనిసెఫ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఫిలిప్పి దంపతులు పాఠశాల విద్యార్థులతో కలసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా వీరికి క్రికెట్ మెలకువలు నేర్పించాడు సెహ్వాగ్. ఆ తర్వాత వీరికి ఓ బ్యాట్ ను కానుకగా ఇచ్చాడు. రేపటి వరకు ఫిలిప్పి దంపతులు భారత్ లో వుంటారు.