మెగా ఫ్యాన్స్ సమక్షంలో 'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముహూర్తం ఖరారు!
- 'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు
- హైదరాబాద్ లో ఈ నెల 19వ తేదీన
- వేదికగా నెక్లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'
- డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు
మెగా అభిమానులు .. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ తన కుటుంబం పట్ల .. దేశం పట్ల బాధ్యత కలిగిన పౌరుడిగా కనిపిస్తాడని దర్శకుడు బీవీఎస్ రవి చెప్పారు. ఈ సినిమా కథను తాను మనసు పెట్టి రాశాననీ .. మనసు పెట్టి తీశానని అన్నారు. తమన్ ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందనీ, తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.