zoya afroz: సల్మాన్ ఫోన్ చేసి బిగ్ బాస్ లో పాల్గొనమని అడిగితే పాల్గొంటా: బాలీవుడ్ నటి ప్రకటన

  • 'హమ్ సాత్ సాత్ హై' సినిమాలో బాలనటిగా నటించిన జోయా అఫ్రోజ్
  • 2013 ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన జోయా అఫ్రోజ్
  • సల్మాన్ లాంటి మంచి వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్న జోయా
సల్మాన్ ఖాన్ తనకు ఫోన్ చేసి, బిగ్ బాస్ షోలో పాల్గొనమని చెబితే తాను పాల్గొంటానని 'ఫెమినా మిస్ ఇండియా 2013' జోయా అఫ్రోజ్ తెలిపింది. ముంబైలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, సల్మాన్ అంతటి మంచి వ్యక్తిని ఈ భూప్రపంచంలో తాను చూడలేదని ఆకాశానికెత్తింది. ఆయన ఫోన్ చేసి అడిగితే కాదనలేనని తెలిపింది. ఆయన స్వయంగా ఫోన్ చేస్తే బిగ్ బాస్ లో పాల్గొనేందుకు సిద్ధమని చెప్పింది. కాగా, జోయా సల్మాన్ నటించిన 'హమ్ సాత్ సాత్ హై' సినిమాలో బాలనటిగా నటించింది. ఈమధ్యే బాలీవుడ్ లో విడుదలైన 'స్వీటీ వెడ్స్ ఎన్ఆర్ఐ' సినిమాలో కూడా నటించింది. 
zoya afroz
Salman Khan
Bollywood
bigg boss

More Telugu News