kirthi suresh: డ్యాన్స్ చేస్తూ కీర్తి సురేష్ పడిపోయిందంటూ వీడియో.. అందులో వున్నది ఆమె కాదంటూ యూనిట్ ప్రకటన!

  • కీర్తి సురేష్ డాన్స్ చేస్తూ కిందపడిపోయిందని, తీవ్రగాయాలయ్యాయని చెబుతూ సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • ఆ హీరోయిన్ కీర్తి సురేష్ కాదని చిత్రయూనిట్ ప్రకటన 
  • కిందపడింది మలయాళ సినీ నటి లిండా కుమార్
ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ కిందపడిపోయిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో దీనిని పలువురు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక వాటర్ ఫాల్స్ వద్ద డాన్స్ చేస్తున్న హీరోయిన్ కిందపడిపోయింది. అయితే ఆమె కీర్తి సురేష్ కాదని, మరొక హీరోయిన్ లిండా కుమార్ అని మలయాళ చిత్రయూనిట్ తెలిపింది.

కోజికోడ్ లోని వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన 'కుంజీరమంటే కుప్పాయం' సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని చిత్రయూనిట్ వివరణ ఇచ్చింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తు లిండా కుమార్ కు స్వల్పగాయాలయ్యాయని ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారని యూనిట్ తెలిపింది. 
kirthi suresh
linda kumar
malayalam movie

More Telugu News