actress pooja kumar: హీరోయిన్ పూజా కుమార్ కు ప్రభాస్ తల్లి ప్రశంస.. ఉబ్బితబ్బిబ్బు అవుతున్న ముద్దుగుమ్మ!

  • పూజా నటన బాగుందన్న ప్రభాస్ తల్లి
  • 'గరుడ వేగ'లో నటనకు ప్రశంసలు
  • ఆనందంలో మునిగిపోయిన పూజ
రాజశేఖర్ నటించిన 'గరుడ వేగ' చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని... విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సినిమా రాజశేఖర్ కు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమా రాజశేఖర్ కే కాకుండా, హీరోయిన్ పూజా కుమార్ కు కూడా మంచి మైలేజ్ ఇచ్చింది.

మరోవైపు, ఈ సినిమాకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తల్లి కూడా మంచి మార్కులు వేశారు. ముఖ్యంగా సినిమాలో పూజా నటన చాలా బాగుందంటూ కితాబిచ్చారట. ఆమె ప్రశంసలతో పూజా ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. అంతేకాదు, థ్యాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ కూడా చేసింది. "నా నటన చాలా బాగుందని... మోస్ట ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ తల్లి చెప్పారు" అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. 
actress pooja kumar
pooja kumar
garudavega
prabhas
prabhas mother

More Telugu News