venu madhav: జగన్ పై వేణుమాధవ్ లేటెస్ట్ కామెంట్స్... వీడియో చూడండి!

  • చూస్తే జాలేస్తోందన్న వేణుమాధవ్
  • ఐదు రోజులు నడవాలి... కోర్టుకెళ్లి రావాలి
  • ఆయన కష్టం ఎవరూ తీర్చలేనిది
  • వ్యంగ్యంగా మాట్లాడిన వేణుమాధవ్
గురువారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన వేణుమాధవ్, ఆపై మీడియాతో మాట్లాడుతూ, వైకాపా అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రపైనా వేణుమాధవ్ సెటైర్లు వేశాడు. "చాలా కష్టపడుతున్నారన్నా పాపం... ఐదు రోజులు పాదయాత్ర చేస్తున్నారు. మళ్లీ కోర్టుకు వెళ్లాలి, రావాలి... ఎంత ఇబ్బంది. ఇంత ఇబ్బంది పడుతున్న జగన్ ను చూస్తుంటే జాలేస్తోంది. వారి కష్టం ఎవరూ తీర్చలేనిది" అని వ్యాఖ్యానించాడు. గతంలోనూ జగన్ పై వేణుమాధవ్ వ్యంగ్యంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ మాట్లాడుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.
venu madhav
Jagan
padayatra

More Telugu News