janasena: 2019 ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగే స్థానంపై జనసేన కీలక ప్రకటన!
మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించిన జనసేన, తమ అధినేత పోటీ చేసే స్థానంపై కొంత క్లారిటీకి వచ్చింది. పవన్ అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తామని తెలిపారు.
పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని తెలిపారు. జనసేనలో పవన్ ఒక్కరు మాత్రమే సుప్రీమ్ అని, ఆయన మాట శిలాశాసనం అని అన్నారు. డిసెంబర్ తొలివారం తరువాత తన పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నారని మహేందర్ రెడ్డి అన్నారు.