Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఘటన.. రేవంత్‌రెడ్డికి బర్త్‌ డే విషెస్ చెబుతూ బొకే పంపిన కేసీఆర్!

షార్ట్స్‌లో చూడండి
రాజకీయాల్లో ఇది సాధారణ విషయమే. సందు దొరికితే తనపై నిప్పులు కక్కే కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బర్త్ డే విషెస్ చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది. రేవంత్ రెడ్డి పేరు చెబితేనే విరుచుకుపడే కేసీఆర్ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ లేఖతోపాటు పుష్పగుచ్చాన్ని రేవంత్‌కు పంపారు. ‘‘దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ప్రజాసేవలో మీరు మరెన్నో ఏళ్లు కొనసాగాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఓటుకు నోటు కేసు తర్వాత టీఆర్ఎస్.. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. సమయం చిక్కినప్పుడల్లా అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనూ ‘ఇక ఆట మొదలైంది’ అని పరోక్షంగా టీఆర్ఎస్‌ను హెచ్చరించారు. అయితే ఇప్పుడు వీటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా కేసీఆర్ బుధవారం రేవంత్‌కు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ పుష్ప గుచ్చాన్ని పంపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
Go Back to Shorts
Revanth Reddy
KCR
Telangana
TRS
Congress

More Telugu News