Donald Trump: బొక్కబోర్లాపడ్డ జపాన్ ప్రధాని.. పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయిన ట్రంప్!

  • జపాన్ ప్రధాని షింజో అబేతో గోల్ఫ్ ఆడిన అమెరికా అధ్యక్షుడు 
  • ట్రంప్ ను సాగనంపేందుకు వేగంగా కదిలి కిందపడిన షింజో 
  • జపాన్ సోషల్ మీడియాలో వీడియో వైరల్
సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... తన ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ జపాన్‌ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబేతో ట్రంప్ సరదాగా గోల్ఫ్ ఆడారు. అనంతరం ట్రంప్ బయల్దేరడంతో, ఆయనకు మర్యాదపూర్వక వీడ్కోలు పలికేందుకు షింజో వేగంగా కదిలారు.

ఈ క్రమంలో ఆయన కాలు జారి పక్కనే వున్న గుంతలో పడిపోయారు. అబే పడిపోయిన విషయాన్ని ఏమాత్రం గమనించని ట్రంప్ తన దారిన తాను కారెక్కి వెళ్లిపోయారు. ఈ వీడియో జపాన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రధాని పడిపోయినా పట్టించుకోలేదంటూ ట్రంప్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. గుంతలో ఇసుక ఎక్కువగా ఉండడం వల్ల అందులో కాలుదూరి తడబడి ప్రధాని కిందపడిపోయారని భద్రతాధికారులు తెలిపారు.
Donald Trump
shinjo abhe
Japan
social media

More Telugu News