himachal pradesh: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 74 శాతం ఓటింగ్ న‌మోదు

  • ప్ర‌శాంతంగా ముగిసిన ఎన్నిక‌లు
  • విజ‌యం త‌మదేన‌ని కాంగ్రెస్‌, బీజేపీ ధీమా 
  • క‌నీసం 35 సీట్లు గెలిస్తే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం
హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. మొత్తం 74 శాతం ఓటింగ్ రికార్డ‌య్యింద‌ని ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. సాయంత్రం 5 గంట‌లలోపు లైనులో నిల‌బ‌డ్డ అంద‌రికీ ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించారు. ఆ రాష్ట్రంలో మొత్తం 68 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మ‌ధ్య పోలింగ్ నిర్వ‌హించారు. విజ‌యం త‌మదేన‌ని కాంగ్రెస్‌, బీజేపీ దేనికదే ధీమాగా ఉన్నాయి. క‌నీసం 35 సీట్లు గెలుపొందిన పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 2012 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 36 సీట్లు గెలిచింది.
himachal pradesh
elections
BJP
Congress

More Telugu News