అల్లూరి సీతారామరాజు: అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి గుండెల్లో ఎలా దడ పుట్టించాడో ఈ చిత్రం మనకు చెబుతుంది: పరిపూర్ణానంద స్వామి
- 20-4-1923న నాటి కలెక్టర్ రూథర్ ఫర్డ్ జారీ చేసిన ప్రకటన
- అల్లూరి సీతారామరాజుని పట్టి ఇచ్చిన వారికి రూ.10000/ -బహూకరింపబడును
- విశాఖ గెజిట్ లో నాటి ప్రకటనను పోస్ట్ చేసిన పరిపూర్ణానంద
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాడు బ్రిటిష్ వారికి ఎలా దడపుట్టించాడనే విషయాన్ని చాటి చెబుతూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణానంద స్వామి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. అల్లూరి సీతారామరాజుని పట్టించిన వారికి నగదు బహూకరిస్తామంటూ నాటి విశాఖ గెజిట్ లో విడుదలైన ప్రభుత్వ ప్రకటనను పరిపూర్ణానంద పోస్ట్ చేశారు.
‘మన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి గుండెల్లో ఎలా దడ పుట్టించాడో ఈ ఒక్క చిత్రం మనకు చెబుతుంది … వందేమాతరం అంటూ భరతమాత ఒడిలో తెల్లదొరల తూటాలకు ఒరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ మనకు ఒక స్ఫూర్తి ప్రధాత…జై హింద్ .. భారత్ మాతాకు జై’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా, ‘అల్లూరి సీతారామరాజుని పట్టి ఇచ్చిన వారికి రూ.10000/ బహూకరింపబడును..’ అంటూ నాటి మద్రాసు ప్రావిన్స్ లోని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్ 20-4-1923న విశాఖ గెజిట్ లో ఈ ప్రకటన ఇచ్చారు.