andhra university: శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందితేనే.. మానవ పురోభివృద్ధి సాధ్యం: ఏయూ వీసీ నాగేశ్వరరావు

  • విద్యార్థులతో శాస్త్రవేత్తల ముఖాముఖి శుభపరిణామం
  • పరిశోధకులకు గొప్ప అవకాశం
  • ఏయూలో నేటితో ముగియనున్న ఏపీ సైన్స్ కాంగ్రెస్ సదస్సు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏపీ సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా నిన్న సాంకేతిక సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న పలువురు శాస్త్రవేత్తలను యూనివర్శిటీ వీసీ నాగేశ్వరరావు అభినందించారు. పలువురు సైంటిస్టులకు జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఐఐటీల డైరెక్టర్లు, సైన్స్ లో అత్యున్నత అవార్డులు సాధించివారు ఇక్కడకు విచ్చేసి, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడటం గొప్ప విషయమని అన్నారు. ఇది పరిశోధకులకు గొప్ప అవకాశమని చెప్పారు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందితేనే.. మానవ పురోభివృద్ధి సాధ్యమని అన్నారు.

సైబర్ సెక్యూరిటీ, నానో టెక్నాలజీ, వైద్యం, ఇంజినీరింగ్, ఆహారం, విద్యుత్తు, ఔషధ మొక్కలు, విపత్తులు, అంతరిక్షం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, నూతన ఆవిష్కరణలు తదితర అంశాలపై ఈ సదస్సులను నిర్వహించారు. విద్యార్థులు, పరిశోధకులకు అవగాహన కల్పించారు. సైన్స్ ప్రాధాన్యతను వివరించారు. ఈ సదస్సు ఈరోజుతో ముగుస్తోంది. 
andhra university
au vc nageswar rao
ap science congress

More Telugu News