himachal pradesh elections: బీజేపీనా? కాంగ్రెస్సా?... హిమాచల్ ప్రదేశ్ లో నేడే పోలింగ్!

  • 68 నియోజకవర్గాల్లో పోలింగ్
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
  • గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 68 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన అన్ని ఏర్పాట్లు చేసింది. 983 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగాను, 399 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరోవైపు వరుస విజయాలతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీ... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మట్టి కరిపించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఇదే సమయంలో పంజాబ్ లో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ హిమాచల్ లో కూడా అదే ఊపును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. 
himachal pradesh elections
BJP
Congress

More Telugu News