Dragon: చైనా ప్రజలను వణికిస్తున్న అస్థి పంజరం.. డ్రాగన్‌దేనా?

  • 60 అడుగులున్న అస్థి పంజరం గుర్తింపు
  • సోషల్ మీడియాలో వైరల్
  • చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు
సోషల్ మీడియాను ఇప్పుడో అస్థి పంజరం ఊపేస్తోంది. ముఖ్యంగా చైనా ప్రజలకు దడ పుట్టిస్తోంది. 60 అడుగుల పొడవున్న ఈ అస్థి పంజరాన్ని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం భూమి మీద జీవించే వాటిలో అంత పొడవున్న జీవులు ఏవీ లేకపోవడం వారిని మరింతగా వణికిస్తోంది.

చైనా పురాణ గాథల్లో ప్రస్తావించే డ్రాగన్‌ను ఇది పోలి ఉండడంతో కచ్చితంగా అదే అయి ఉంటుందని చెబుతున్నారు. చైనాలోని ఝాంగ్జియా నగరంలో ఇది కనిపించడంతో చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఇప్పుడా ప్రదేశం తిరునాళ్లను తలపిస్తోంది. ఈ వీడియోను ఇప్పటికే పది లక్షల మంది వీక్షించారు. తమకు తోచిన భాష్యం చెబుతున్నారు. మీరూ చూడండి.

వీడియో సౌజన్యం: ఆల్ యు వాంట్
Dragon
Skeleton
China

More Telugu News