బాలకృష్ణ: విశాఖలో గిరిజన మహిళలతో కలిసి బాలయ్య ‘థింసా’!

  • విశాఖలో తెలుగు యువత కార్యవర్గం ప్రమాణ స్వీకారం
  • సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబుకు ఎవరూ సాటిలేరు
  • రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్న ఆలోచన ప్రతిపక్షాలకు లేదు 
  • టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ 
సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం చంద్రబాబుకు ఎవరూ సాటిలేరని టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రశంసించారు. విశాఖపట్టణంలో తెలుగు యువత కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఏపీలో ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్న కనీస ఆలోచన కూడా లేదని విమర్శించారు.

 గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరులో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. కాగా, అంతకుముందు, గిరిజన మహిళలతో కలిసి బాలయ్య చేసిన థింసా నృత్యం ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని తిలకించిన తెలుగు తమ్ముళ్లు, బాలయ్య అభిమానులు మైమరచిపోయారు.

బాలకృష్ణ
తెలుగు యువత

More Telugu News