Revanth Reddy: కేసీఆర్‌ తెలంగాణ బిడ్డే అయితే కొడంగ‌ల్‌లో మీటింగ్ పెట్టాలి: రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోని కోస్గిలో ఈ రోజు జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశంలో పాల్గొన్న‌ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్‌ తెలంగాణ బిడ్డే అయితే కొడంగల్‌కు వచ్చి మీటింగ్ పెట్టాల‌ని, త‌మ‌ కార్యకర్తల దమ్మేంటో తెలుస్తుందని స‌వాలు విసిరారు. టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయ‌న ఆరోపించారు.

నందారం వెంకటయ్య చివరి కోరిక అయిన‌ కోస్గి బస్ డిపో నిర్మాణం కోసం తాను తన సోదరుడి పేరుమీద 4 ఎకరాలు కొనుగోలు చేసి అప్పగించామని చెప్పారు. ఇప్ప‌టికి 40 నెలలైనా బస్ డిపో నిర్మాణానికి టెండర్లు పిలవడం లేదని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మగౌరవం పెంచేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ స‌ర్కారుని నిల‌దీస్తున్నాన‌ని తెలిపారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
kodangal

More Telugu News