పాలకుర్తి: పాలకుర్తి నుంచే మళ్లీ పోటీ చేస్తా: తేల్చిచెప్పిన టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి

  • 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలుస్తా
  • జనగామ నియోజకవర్గానికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు
  • తెలంగాణ అసెంబ్లీ లాబీలో పాత్రికేయులతో మాట్లాడిన ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి నుంచే మళ్లీ పోటీ చేస్తానని, 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలుస్తానని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, తన నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను తప్పా, జనగామ నియోజకవర్గానికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.

 జనగామ జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసే పని చేస్తున్నామని, నిబంధనల ప్రకారం పనిచేసే మంత్రి కడియం శ్రీహరి అని ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రశంసించారు. మరో నేత జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కల్వకుర్తి నుంచి ఏ పార్టీ నాయకుడిని కొనుగోలు చేసి టీఆర్ఎస్ లో చేర్చుకోలేదని, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కాగా, ఎర్రబెల్లి తన నియోజకవర్గం మారుతున్నారని, వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి ఆయన పోటీ చేస్తారనే వదంతులకు దయాకర్ రావు వ్యాఖ్యలతో చెక్ పడినట్టయింది.
పాలకుర్తి
టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి

More Telugu News