manasuku nachchindi: నీ ప్రయత్నం ఓ మ్యాజిక్ సృష్టిస్తుంది..: మంజులపై దర్శకేంద్రుని ప్రశంసల వర్షం

  • కళ్ల ముందు పెరిగిన అమ్మాయి మంజుల
  • మనసు చెప్పిన విషయాన్ని నమ్మి సాగుతుంది
  • పుట్టిన రోజు శుభాకాంక్షలు
  • ట్విట్టర్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
తన మనసులోని బాధను, నటిగా రాణించాలన్న కోరికను తీర్చుకోలేక పోయినందుకు పడ్డ తపనను వివరిస్తూ, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల తీసుకున్న లఘు చిత్రం 'మనసుకు నచ్చింది' సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వేళ, దాన్ని చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మంజుల ప్రయత్నంపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆమె తన ప్రయత్నం ద్వారా ఓ మ్యాజిక్ ను క్రియేట్ చేయనున్నారని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. మంజులను చిన్నతనం నుంచి తాను చూస్తున్నానని, తన కళ్ల ముందే పెరిగిందని గుర్తు చేసుకున్న రాఘవేంద్రరావు, ఆమె తన మనసు చెప్పిన మాటలను నమ్మి ముందుకు సాగే మహిళని అన్నారు. నేడు ఆమె పుట్టిన రోజని, ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
manasuku nachchindi
raghavendrarao
manjula

More Telugu News