కేసీఆర్‌: సీఎం కేసీఆర్ బురిడీ బాబాలా తయారయ్యారు: కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డి

  • మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
  • కేసీఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్
  • కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ఏకరువు పెట్టాలని పిలుపు
మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం కేసీఆర్ బురిడీ బాబాలా తయారయ్యారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఈరోజు నిర్వహించారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ లోని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్ పైన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్, ఈ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ తన పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని అన్నారు.

ప్రతి ఇంటికీ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి, కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఏకరువు పెట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడతామని అన్నారు. అనంతరం, సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. అంతకుముందు, ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకులను, సీనియర్ కార్యకర్తలను రేవంత్ రెడ్డికి పరిచయం చేశారు. 
కేసీఆర్‌
రేవంత్‌ రెడ్డి

More Telugu News