rajasekhar: నా టైమ్ బాగోలేదని భావించాను .. సినిమా ఆడదనే అనుకున్నాను!: రాజశేఖర్

  • ఒక వైపున తల్లి మరణం 
  • మరో వైపున జీవిత సోదరుడి మరణం 
  • వరుసగా బాధ కలిగించే సంఘటనలు 
  • దాంతో సినిమాపై కూడా నమ్మకం పోయింది       
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ చేసిన 'గరుడవేగ' ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న రాజశేఖర్, ఈ సినిమాకి సక్సెస్ టాక్ రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

 "ఈ సినిమా రిలీజ్ కావడానికి మూడు వారాల ముందు నా తల్లి చనిపోయింది. ఇక మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుంది అనగా జీవిత సోదరుడు చనిపోయాడు. మరో వైపున చెన్నైను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆ వానలు ఇటువైపు కూడా వస్తాయేమోనని చాలా టెన్షన్ పడ్డాను.

ఈ సినిమా రిలీజ్ కి ముందు ఇలా వరుసగా బాధాకరమైన సంఘటనలు జరుగుతూ వచ్చాయి. దాంతో నా టైమ్ బాగోలేదనిపించింది ..  ఈ సినిమా ఆడదేమోనని అనిపించింది. కానీ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించడం ఆనందంగా వుంది. ఈ సినిమా సక్సెస్ కి సహకరించిన చిరంజీవి .. బాలకృష్ణలకి ఎంతగానో రుణపడి ఉంటాను" అని చెప్పుకొచ్చారు. 
rajasekhar
pooja kumar

More Telugu News