రాహుల్: రాహుల్ గాంధీతో విజయశాంతి భేటీ!
- ఢిల్లీలో రాహుల్ ని కలిసిన విజయశాంతి
- ఈ భేటీలో పాల్గొన్న కుంతియా, ఉత్తమ్ కుమార్
- విజయశాంతికి ప్రచారకమిటీలో స్థానం, ఏఐసీసీ సెక్రటరీ పదవి?
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆ పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి సమావేశమయ్యారు. ఢిల్లీలో రాహుల్ తో జరిగిన ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీపీసీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, క్రియాశీలక రాజకీయాల్లోకి విజయశాంతి రానున్నారని, ఆమెకు ప్రచార కమిటీలో స్థానం, ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, విజయశాంతి క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ కానున్నట్టు ఉత్తమ్ ఇటీవల ప్రకటించారు. ఈ మధ్య కుంతియా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన్ని విజయశాంతి కలవడం విదితమే.