ఇది డబ్బింగ్ సినిమా కాదు .. నేను పరాయివాడినీ కాదు!: సందీప్ కిషన్
- 'కేరాఫ్ సూర్య' అచ్చమైన తెలుగు సినిమా
- తెలుగుతో పాటే తమిళంలో చిత్రీకరించాం
- నిజం చెప్పడానికి వెనుకాడను
- నన్ను వేరుగా చూడటం బాధ కలిగిస్తోంది
ఈ మధ్య తాను ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తుండటం వలన తనని పరాయివాడిగా భావిస్తున్నారనీ, 'కేరాఫ్ సూర్య' సినిమాను డబ్బింగ్ సినిమా అని అంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. నిజంగా డబ్బింగ్ సినిమా అయితే ఆ విషయం చెప్పడానికి తాను ఎంత మాత్రం ఆలోచించననీ, కానీ ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించడం జరిగిందని అన్నాడు. ఇది అచ్చమైన తెలుగు సినిమా అనడంలో ఎంతమాత్రం సందేహం లేదనీ, ద్విభాషా చిత్రాలను చేస్తోన్న తనని ఇలా పరాయివాడిగా చూడటం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.