trivikram: త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఫోటోస్ రిలీజ్ చేసిన 'అజ్ఞాతవాసి' టీమ్

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ అగ్రదర్శకుల జాబితాలో త్రివిక్రమ్ పేరు కనిపిస్తుంది. అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే మంత్రం ఆయనకి బాగా తెలుసు. అందువల్లనే టీవీల్లో ఆయన సినిమాలు ఎన్నిసార్లు ప్రసారమైనా మంచి రేటింగ్స్ వస్తాయి. యాక్షన్ ... ఎమోషన్ ను కలిపిన వినోదాన్ని అందించడం ఆయన ప్రత్యేకత. ఆయన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' కూడా అదే తరహాలో రూపొందుతోంది.

 ఈ రోజున త్రివిక్రమ్ పుట్టినరోజు .. పవన్ సినిమా సెట్స్ పై ఉండగా ఆయన పుట్టినరోజు రావడం విశేషం. పవన్ కి ఇది 25వ సినిమా కావడం .. ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ బర్త్ డే రావడం యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. దాంతో వాళ్లంతా కూడా త్రివిక్రమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి సంబంధించిన స్పెషల్ ఫోటోలను రిలీజ్ చేశారు. వీటిలో .. సోఫాపై పవన్ పక్కనే కూర్చున్న ఆయన ఫోటో, వాళ్లిద్దరి స్నేహానికి అద్దం పడుతోంది. పవన్ ఫ్యాన్స్ ముచ్చట పడేలా చేస్తోంది.
Go Back to Shorts
trivikram
pavan

More Telugu News