Kamal Haasan: అభిమానుల అసంతృప్తిని తీర్చే ప్రయత్నం చేసిన కమలహాసన్!
- పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన కమల్
- వేడుకలే కావాలంటే ఒకరోజు తరువాతైనా జరుపుకోండి
- మనం మారి, మార్పును సూచిద్దాం
- అభిమానులకు కమల్ సూచన
తన పుట్టిన రోజు వేడుకలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు విలక్షణ నటుడు కమలహాసన్ చేసిన ప్రకటన, ఆయన అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించగా, వారిని ఊరడించేందుకు కమల్ రంగంలోకి దిగారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో తమిళం, ఇంగ్లీషుల్లో పోస్టులు పెట్టారు. తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాలన్న ఆలోచనపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారందరికీ తన విన్నపం ఒకటేనని చెప్పారు.
కేవలం పండగ వాతావరణం, వేడుకల కోసమే అయితే, ఒక రోజు ఆలస్యంగానైనే వాటిని జరుపుకోవచ్చని, అయితే, అనుకుంటున్న మార్పు రావాలంటే మాత్రం పధ్ధతి ఇది కాదని, ముందుగా మనం మారి చూపాలని హితవు పలికారు. కాగా, గత 40 సంవత్సరాల్లో 200కు పైగా సినిమాల్లో నటించి, ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్న ఆయన, యువరక్తానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు.