'సైరాట్' రీమేక్ ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేయనున్న శ్రీదేవి కూతురు జాహ్నవి
- హీరోగా షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్
- సంచలన విజయాన్ని నమోదు చేసిన మరాఠి చిత్రం
- రూ. 100 కోట్లు వసూలు చేసిన మొదటి మరాఠి చిత్రం 'సైరాట్'
మరాఠిలో రింకు రాజ్గురు, ఆకాశ్ థోసర్లు నటించిన 'సైరాట్' చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసిన మొదటి మరాఠి చిత్రంగా నిలిచింది. బిజినెస్, కలెక్షన్లు, నటన, అవార్డుల పరంగా కూడా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని మరాఠి బ్లాక్ బస్టర్గా నిలిచింది.