Narendra Modi: కరుణానిధితో మోదీ భేటీ.. వేడెక్కిన తమిళ రాజకీయం!

  • కరుణ నివాసానికి వెళ్లిన మోదీ
  • 10 నిమిషాల భేటీ
  • వీరి భేటీపై తమిళనాట ఊహాగానాలు 
డీఎంకే అధినేత కరుణానిధితో ప్రధాని మోదీ ఈ ఉదయం భేటీ అయిన సంగతి విదితమే. తమిళనాడు దినపత్రిక 'దినతంతి' 75వ వార్షికోత్సవం సందర్భంగా నేడు మోదీ చెన్నై వెళ్లారు. ఈ సందర్బంగా గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ, కరుణలు 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు.

దీంతో తమిళనాట రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. 2019లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, వీరిద్దరి మధ్య భేటీ తమిళనాట చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, పళనిస్వామిల వర్గాలు కలసిపోయినప్పటికీ... వారికి ఇంకా 'రెండాకుల' గుర్తు మాత్రం దక్కలేదు.

మరోవైపు కరుణ నివాసానికి వెళ్లిన విషయాన్ని మోదీ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిశానని... ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశానని ట్వీట్ చేశారు. 
Narendra Modi
karunanidhi
stallion
modi meets karunanidhi

More Telugu News