srinivas goud: కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌ రెడ్డి చేరిక విశేషమేమీ కాదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ మ‌హాస‌ముద్రం లాంటిదని అందులో చేరిన కొడంగ‌ల్ నేత రేవంత్ రెడ్డి ఓ బిందువు లాంటి వాడ‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఎందరో మహామహులున్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌ చేరిక విశేషమేమీ కాదని, త‌మ పార్టీని ఓడించ‌లేర‌ని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాము గెలుస్తామ‌ని చెప్పారు.

రాష్ట్రంలో త‌మ స‌ర్కారు చేపడుతోన్న‌ పథకాల ప‌ట్ల ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని, తాము అమ‌ల్లోకి తెచ్చిన ప‌థ‌కాలే తమను గెలిపిస్తాయ‌ని తెలిపారు. టీజేఏసీ కోదండరామ్‌కి పార్టీ పెట్టాల‌ని ఉంద‌ని, ఒక‌వేళ ఆయన పార్టీ పెట్టినా త‌మ‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌ద‌ని చెప్పారు.  
Go Back to Shorts
srinivas goud
Revanth Reddy

More Telugu News