Mahesh Babu: చరణ్ తరువాత మహేశ్ తో .. కథ వినిపించేసిన సుకుమార్

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం చరణ్ కథానాయకుడిగా సుకుమార్ 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మహేశ్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నట్టు సమాచారం. గతంలో మహేశ్ తో ఆయన '1 నేనొక్కడినే' సినిమా చేశాడు. టేకింగ్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వున్నారు.

రీసెంట్ గా మహేశ్ ను కలిసిన సుకుమార్ ఒక కథ వినిపించాడట. కథ కొత్తగా ఉండటం .. తాను ఇంతవరకూ చేయని పాత్ర కావడంతో మహేశ్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. '1 నేనొక్కడినే' సినిమాను నిర్మించిన 14 రీల్స్ సంస్థ వారే ఈ సినిమాను కూడా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో తనని సుకుమార్ చూపించిన తీరు మహేశ్ బాబుకు బాగా నచ్చిందట. అంతే కాదు .. ఆ కథను సుకుమార్ హ్యాండిల్ చేసిన తీరు కూడా ఆయనను ఆకట్టుకుందట. అందువల్లనే సుకుమార్ తో మరో సినిమా చేయడానికి మహేశ్ అంగీకరించాడని అంటున్నారు. అదే నిజమైతే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.      
Go Back to Shorts
Mahesh Babu
sukumar

More Telugu News