charan: హిందీ శాటిలైట్ హక్కుల విషయంలోను 'రంగస్థలం' తగ్గలేదు!

షార్ట్స్‌లో చూడండి
మెగా అభిమానులంతా 'రంగస్థలం 1985' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 'నాన్నకు ప్రేమతో' సినిమాను పూర్తి స్థాయిలో విదేశాల్లో చిత్రీకరించిన సుకుమార్, ఆ తరువాత సినిమా అయిన 'రంగస్థలం'ను పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను 18 కోట్లకు ప్రముఖ టీవీ ఛానల్ వారు సొంతం చేసుకున్నారు. ఇక హిందీ శాటిలైట్ హక్కులను .. హిందీలోని ఓ ఎంటర్టైన్ మెంట్ ఛానల్ .. 10.50 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. 'బాహుబలి' తరువాత హిందీలో తెలుగు సినిమాలకి ఆదరణ పెరిగింది. అంతే కాకుండా హిందీ ప్రేక్షకులకు చరణ్ బాగానే తెలుసు. అందువలన హిందీ శాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకే అమ్ముడయ్యాయని అంటున్నారు.      
Go Back to Shorts
charan
samanta

More Telugu News