ys jagan: కారణం అడిగితే మోదీ లాగి తంతారనేది చంద్రబాబు భయం: జగన్

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్నో సంస్థలు, కార్యాలయాలు ఉన్నాయని... ఏపీ రాజధాని పరిస్థితి ఎలా ఉందో అందరూ చూడాలని... అలాంటి సంస్థలు, కార్యాలయాలు కావాలని చంద్రబాబు ఏనాడూ అడగరని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ చంద్రబాబు మోసం చేస్తున్నారని... ఇంతవరకు ఒక్క పైసా పెట్టుబడి కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. రూ. 10వేల ప్రాజెక్ట్ అయినా వచ్చిందా? అంటూ సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ప్రతి ప్రాజెక్ట్ లో చంద్రబాబు 30 శాతం లంచం తీసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ఏదైనా అడిగితే... మోదీ లాగి తంతారనేది చంద్రబాబు భయమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రారని... ప్రత్యేక హోదా వస్తేనే వారు వస్తారని అన్నారు. 
Go Back to Shorts
ys jagan
YSRCP
Chandrababu
jagan padayatra

More Telugu News