vijayendraprasad: సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' కి చిరంజీవి నటించిన 'పసివాడి ప్రాణం' స్ఫూర్తి!: రచయిత విజయేంద్ర ప్రసాద్

  • రవీంద్ర భారతిలో సినీ, టెలివిజన్‌ దర్శకుల శిక్షణ శిబిరం ముగింపోత్సవం 
  • తన అనుభవాలు పంచుకున్న విజయేంద్ర ప్రసాద్
  • రచయితకు కథపై పట్టు ఉంటే, దర్శకుడికి 24 విభాగాలపై పట్టు ఉండాలి
హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' సినిమాకి స్పూర్తి చిరంజీవి నటించిన 'పసివాడి ప్రాణం' సినిమా అని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు టెలివిజన్‌ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ, టెలివిజన్‌ దర్శకుల శిక్షణ శిబిరం ముగింపోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ, ఏదైనా కథ నుంచి స్ఫూర్తి పొంది కొత్తగా కథను చెప్పడానికీ, కాపీ కొట్టడానికి తేడా ఉందని అన్నారు. రచయితకు కథపై పట్టుతో పాటు చెప్పాలనుకున్న విషయంపై క్లారిటీ ఉండాలని అన్నారు. అలాగే దర్శకుడికి సినిమాలోని 24 విభాగాలపైన సమగ్ర అవగాహన ఉండాలని ఆయన సూచించారు. 
vijayendraprasad
bhajarangi bhai jaan
pasivadi pranam
Salman Khan
Chiranjeevi

More Telugu News