Rajasekhar: యాక్సిడెంటు ఘటనలో.. నటుడు రాజశేఖర్ కుమార్తె శివానిపై కేసు నమోదు!

  • పార్క్ చేసిన కారును ఢీకొన్న శివాని కారు
  • బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
  • రెండు రోజులు ఆలస్యంగా వెలుగులోకి!
సినీనటుడు రాజశేఖర్ కుమార్తె శివానిపై హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శనివారం సాయంత్రం శివాని తన కారులో జూబ్లీహిల్స్ నుంచి నవనిర్మాణనగర్‌ వైపు వెళ్తూ స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టారు. ప్రమాదం కారణంగా కారు చాలా వరకు పాడైంది.

ఈ ఘటనపై ఎస్‌పీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌ సీనియర్ ఆపరేషనల్ మేనేజర్ అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. శివానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. శివాని యాక్సిడెంట్ గురించి శనివారం రాత్రే వార్తలు వచ్చినా కేసు నమోదు కాకపోవడంతో అధికారికంగా వెలుగులోకి రాలేదు.
Rajasekhar
Tollywood
Shivani
Accident

More Telugu News