బుద్దా వెంకన్న: చంద్రబాబును శ్రీరాముడితో జగన్ ని రాక్షసుడితో పోల్చిన టీడీపీ నేత!
- జగన్ పై విమర్శలు గుప్పించిన బుద్దా వెంకన్న
- ఏపీలో శ్రీరాముడి పాలన నడుస్తోంది
- రాక్షసుడు పాదయాత్రకు సిద్ధమయ్యాడు
- ఇచ్చాపురం వెళ్లే లోపు జగన్ జైలుకు వెళ్లడం ఖాయం
ఏపీ సీఎం చంద్రబాబును శ్రీరాముడితో, వైసీపీ అధినేత జగన్ ని రాక్షసుడితో పోల్చుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న అభివర్ణించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో శ్రీరాముడి పాలన నడుస్తోందని, ఏం చేయాలో తెలియని రాక్షసుడు పాదయాత్రకు సిద్ధమయ్యాడంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ ని ప్రజలు నిలదీయాలని, పాదయాత్రలో మత కలహాలు, కుల ఘర్షణలు సృష్టించేందుకు ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వెళ్లే లోపు జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. పార్టీకి ఒక నియంత అధ్యక్షుడైతే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం జగన్ అని, 2019 ఎన్నికల నాటికి ప్రతిపక్షమే ఉండదని, టీడీపీకి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.