Kamal Haasan: విశాఖపట్నంలో కమలహాసన్ దిష్టిబొమ్మ దహనం

  • దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జన జాగరణ సమితి కార్యకర్తలు
  • కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు
  • తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
హిందూ ఉగ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమలహాసన్ పై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, విశాఖపట్నంలో కూడా కమల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విశాఖలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన జన జాగరణ సమితి కార్యకర్తలు ఈ సందర్భంగా కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం సమీపంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కమల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని... లేకపోతే రానున్న రోజుల్లో విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Kamal Haasan
Vizag
jana jagarana samithi

More Telugu News