KCR: కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన ఏపీ మంత్రి యనమల

  • దేవాలయాలను కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు
  • దేవాలయాల అభివృద్ధి అంటే చరిత్రను కాపాడటమే
  • తిరుమలలా యాదాద్రి అభివృద్ధి చెందాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని దేవాలయాలను కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని... దేవాలయాలను అభివృద్ధి చేయడమంటే, చరిత్రను కాపాడటమేనని ఆయన అన్నారు. ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యాదాద్రికి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఏపీకి తిరుమల వలె, తెలంగాణకు యాదాద్రి తలమానికంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని కోరుకున్నానని చెప్పారు.
KCR
yanamala ramakrishnudu
yadadri
yanamala praises kcr

More Telugu News