Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. టీ20ల్లో 7 వేల పరుగులు చేసిన తొలి భారత ఆటగాడు!

  • అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు సాధించిన సారథి
  • ఓవరాల్‌గా రెండో ఆటగాడు
  • అగ్రస్థానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్
రికార్డులను అలవోకగా తన ఖాతాలో వేసుకుంటున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. రాజ్‌కోట్‌లో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 65 పరుగులు చేసిన కోహ్లీ టీ20లలో 7 వేల పరుగులు సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. 212వ టీ20 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం ద్వారా అత్యంత వేగవంతంగా 7 వేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు.

కోహ్లీ కంటే ముందు విండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు, టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 309 మ్యాచ్‌లు ఆడిన గేల్ 10,571 పరుగులతో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాడు.
Virat Kohli
Chris Gayle
Team India

More Telugu News