sri vishnu: ఇద్దరూ మంచి స్నేహితులు .. అయినా పోటీ తప్పడం లేదు!

షార్ట్స్‌లో చూడండి
నారా రోహిత్ .. శ్రీవిష్ణు ఇద్దరూ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. గతంలో నారా రోహిత్ తాను చేసిన 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలో శ్రీవిష్ణుకు ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించాడు. ఆ సినిమా సక్సెస్ ను సాధించడమే కాకుండా, శ్రీవిష్ణుకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత అటు నారా రోహిత్ .. ఇటు శ్రీవిష్ణు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయ్యారు.

ఈ నేపథ్యంలో నారా రోహిత్ చేసిన 'బాలకృష్ణుడు' సినిమా, ఈ నెల 24వ తేదీన విడుదలవుతోంది. ఇక శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన 'మెంటల్ మదిలో' సినిమాను కూడా అదే రోజున విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కలిసి హిట్ కొట్టిన ఈ స్నేహితులు .. ఇప్పుడు ఒకే రోజున వేరు వేరు సినిమాలతో రంగంలోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ స్నేహితులు మాత్రం ఒకరి సినిమా హిట్ కొట్టాలని మరొకరు కోరుకుంటున్నారు.   
Go Back to Shorts
sri vishnu
nivetha pethuraj

More Telugu News