prattipati pullarai: జగన్‌ అహంకారి అని అతని ప్రవర్తన చూస్తే అర్థమవుతోంది: ప్రత్తిపాటి

  • గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన ప్ర‌త్తిపాటి
  • ప్రజలు జ‌గ‌న్‌ను క్షమించబోరు
  • జ‌గ‌న్ చేస్తున్న‌ది విషపూరితమైన పాదయాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జగన్మోహ‌న్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు ఆయన్ను క్షమించబోర‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ...  జగన్ ఓ అహంకారి అని, ఈ విష‌యం అతని ప్రవర్తన చూస్తేనే అర్థమైపోతుంద‌ని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ చేస్తున్న‌ది విషపూరితమైన పాదయాత్ర అని ఆయ‌న అన్నారు.

ఇటీవ‌ల నంద్యాల, కాకినాడలో జ‌రిగిన‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత కూడా జగన్ వైఖ‌రిలో మార్పురాలేద‌ని వ్యాఖ్యానించారు. జగన్ తాము చేస్తోన్న ప‌నుల‌కు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము మాత్రం ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకుంటున్నామ‌ని ప్ర‌త్తిపాటి అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు రహదారులను అభివృద్ధి చేశార‌ని అన్నారు.
prattipati pullarai
jagan

More Telugu News