వైమానిక దళం అమ్ములపొదిలో మరో అస్త్రం... 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యం తునాతునకలు! కావాల్సిందే
- గ్లైడ్ బాంబును విజయవంతంగా పరీక్షించిన వాయుసేన
- ఒడిశాలోని చండీపూర్ లో విమానం నుంచి ప్రయోగం
- మూడు విభిన్న పరిస్థితుల్లో ప్రయోగం... మూడూ సక్సెస్
స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ గా పిలుచుకునే ఈ గ్లైడ్ బాంబును... మూడు విభిన్న పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (ఆర్సీఐ) సంయుక్తంగా దీనిని తయారు చేశాయి. త్వరలో ఈ బాంబులను ఆర్మ్ డ్ ఫోర్సెస్ కు అందిస్తామని డీఆర్డీవో ఛైర్మన్ తెలిపారు.