farewell party: వీడ్కోలు పార్టీలో ఆశిష్ నెహ్రా ముఖాన్ని కేకుతో నింపేసిన స‌హ‌క్రికెట‌ర్లు

  • సోష‌ల్ మీడియాలో ఫొటోలు
  • 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పిన ఆశిష్ ‌
  • మిత్రులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వీడ్కోలు పార్టీ
త‌న 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కి ముగింపు ప‌లికిన భార‌త క్రికెట‌ర్‌ ఆశిష్ నెహ్రాకు స‌హ‌క్రికెట‌ర్లు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. జ‌ట్టు స‌భ్యులు, ఇత‌ర ముఖ్య వ్య‌క్తులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్న ఈ పార్టీలో ఆశిష్ నెహ్రా ముఖాన్ని కేకుతో నింపేశారు. ఈ పార్టీకి హాజ‌రైన కొంత‌మంది అక్క‌డి ఫొటోల‌ను, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టారు.

జ‌ట్టు కెప్టెన్ విరాట్‌కి ఆశిష్ కేకు తినిపించ‌డం, పూర్తిగా కేకుతో నిండిపోయిన ఆశిష్ ను ఈ వీడియో, ఫొటోల్లో చూడొచ్చు. ఆశిష్ ఆప్త మిత్రుడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ పార్టీకి వ‌చ్చాడు. 1997లో రంజీ మ్యాచ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన 38 ఏళ్ల ఆశిష్ నెహ్రా, అప్ప‌ట్లో సెహ్వాగ్‌తో క‌లిసి ఢిల్లీ రాష్ట్ర జ‌ట్టులో ఆడాడు.
farewell party
ashish nehra
cake
co cricketers
virendra sehwag
virat kohli

More Telugu News