mahith narayan: చక్రి తన ఇంటికి 'పూజ' కుటీర్ అని పేరు పెట్టారు .. పూజ అంటే పూరీ జగన్నాథ్ : మహిత్ నారాయణ్

  • పూరీ అంటే అన్నయ్యకి విపరీతమైన అభిమానం 
  • తన ఇంటికి పూరీ జగన్నాథ్ పేరునే పెట్టాడు 
  • అతి మంచితనంతో అన్నయ్య నష్టపోయాడు 
  • ఆయన నుంచి హార్డ్ వర్క్ ను నేర్చుకున్నాను  
చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను ప్రస్తావించారు. " నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను .. మా అన్నయ్య విషయంలోను అది నిజమైంది. మా అన్నయ్యకి అదృష్టమనేది లేకపోతే పూరీ జగన్నాథ్ తగిలి ఉండేవాడే కాదు. బంజారా హిల్స్ లో అన్నయ్య తన ఇంటికి 'పూజ కుటీర్' అనే పేరును స్టోన్స్ తో చేయించి పెట్టాడు. పూజ .. అంటే పూరీ జగన్నాథ్ అని అర్థం. తనకి అవకాశాలు ఇచ్చిన పూరీ జగన్నాథ్ ను ఆయన అంతగా అభిమానించాడు" అని అన్నారు.

 "చివర్లో అన్నయ్యతో పూరీ వర్క్ చేయకపోయినా, పూరీ పట్ల ఆయన అభిమానం ఎంత మాత్రం తగ్గేది కాదు. పూరీని మళ్లీ ఓ సినిమా అడగొచ్చుగదా అన్నయ్యా .. అంటే,  "ఆయనకి ఉండేవి ఆయనకి వుంటాయిరా .. అవకాశం వుంటే ఇచ్చేవాడేగా .. నేనంటే ఆయనకేం వైరం లేదు కదా" అనేవాడు. "ఇంత పాజిటివ్ గా ఆలోచించేవాళ్లు ఇంకొకరుండరు. ఇక అతి మంచితనం వుండకూడదు .. అంకితభావంతో హార్డ్ వర్క్ చేయాలనేవి ఆయనను చూసి నేర్చుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.          
mahith narayan

More Telugu News