anushka sharma: కానుకలతో చిత్రయూనిట్ ను ఆనందంలో ముంచెత్తిన అనుష్క శర్మ!

  • ఆనంద్ ఎల్ రాయ్ చిత్రంలో నటిస్తున్న అనుష్క శర్మ
  • ఈ సినిమాలో షారూఖ్, కత్రినాలతో కలసి నటిస్తున్న అనుష్క
  • 'నుష్' నుంచి దుస్తులు తెప్పించి యూనిట్ లోని మహిళలకు పంచిన అనుష్క
బాలీవుడ్‌ నటి, కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మ తన సినిమా సెట్‌ లోని మహిళలకు సర్ ప్రైజ్ ఇచ్చింది. షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్మ శర్మ ప్రధాన తారాగణంగా ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న అనుష్క శర్మ సహ నటీమణులతో పాటు యూనిట్ లో పని చేస్తున్న ఇతర మహిళలకు తన దుస్తుల సంస్థ ‘నుష్‌’ నుంచి ట్రెండీ వేర్ ను తెప్పించి బహూకరించింది.

దీంతో వారంతా తెగసంబరపడిపోయారు. అనుష్క తమతో చాలా సరదాగా ఉంటుందని, తమ ఇష్టాయిష్టాలు తెలుసుకుంటుందని తెలిపారు. అలా వారి ఇష్టాలకు అనుగుణంగా ఉన్న దుస్తులను తెప్పించి ఇచ్చిందని వారు తెలిపారు.  
anushka sharma
nush
movie unit

More Telugu News